నిస్వార్థజీవి
నిస్వార్థజీవి తనకేమి లాభమ్ము తనభుజముల మోయ తన బిడ్డ పడునను తపన గాక ! తనకేమి లాభమ్ము ధనమును వెచ్చింప బిడ్డల చదువుల ప్రేమగాక ! తనకేమి లాభమ్ము తనయుల దిట్టుచో వారి యభ్యున్నతిన్ కోరి గాక ! తనకేమి లాభమ్ము దయను జూపింపగా తన బిడ్డ కష్టమ్ము దలచి గాక ! ప్రతిఫలాపేక్ష లేని నిస్వార్థజీవి నాన్న యన మానవాకృతి నడచుదైవ.. మతడు మన మార్గదర్శి , సహాయకారి తండ్రినిన్ మ్రొక్క జన్మమ్ము ధన్యమగును !!